ఫేస్‌బుక్ కొత్త లోగో...

- November 05, 2019 , by Maagulf
ఫేస్‌బుక్ కొత్త లోగో...

ప్రస్తుతం ప్రంపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనే ఎన్ని మాధ్యమాలు ఉన్నా ఫేస్‌బుక్ మిగిలిన అన్నింటి కన్నా మిగిలిన వాటిని డామినేట్ చేస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ తదితర పేరున్న యాప్స్ కు మాతృసంస్థగా ఉన్న ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులతో యూజర్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.

ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ సరికొత్త లోగోతో మనముందుకు రాబోతోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో నూతన లోగోను విడుదల చేసింది. ఫేస్ బుక్ కు అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నుంచి ఫేస్ బుక్ మరింత స్పష్టతను కోరుకుంటోందని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది.
అంతేకాకుండా ఫేస్‌బుక్ యూజర్లకు కూడా సామాజిక మాధ్యమాలను గుర్తించడంలో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో లోగోను మార్చినట్టు ఫేస్ బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆంటోనియో లూసియో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ కొత్త వెబ్‌సైట్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నామని ఆంటోనియో వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com