లేబర్‌ చట్టం ఉల్లంఘన: 100 మందికి పైగా అరెస్ట్‌

- November 06, 2019 , by Maagulf
లేబర్‌ చట్టం ఉల్లంఘన: 100 మందికి పైగా అరెస్ట్‌

మస్కట్‌: 100 మందికి పైగా వలసదారుల్ని మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో అరెస్ట్‌ చేయడం జరిగింది. లేబర్‌ మరియు రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన నేపథ్యంలో వీరిని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ వెల్లడించింది. జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ ఈ మేరకు తనిఖీలు నిర్వహించింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఈ మేరకు అధికారులకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. రువిలోని విలాయత్‌ ఆఫ్‌ ముట్రా, హమ్రియా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 109 మంది ఇల్లీగల్‌ వర్కర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అరెస్ట్‌ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com