ఫుడ్‌ సేఫ్టీ ఉల్లంఘన: అల్‌ అయిన్‌లో రెస్టారెంట్‌ మూసివేత

- November 06, 2019 , by Maagulf
ఫుడ్‌ సేఫ్టీ ఉల్లంఘన: అల్‌ అయిన్‌లో రెస్టారెంట్‌ మూసివేత

అబుదాబీ అగ్రిక్లచర్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ, అల్‌ అయిన్‌లోని ఓ రెస్టారెంట్‌ని ఫుడ్‌ సేఫ్టీ ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్‌ క్రస్ట్‌, ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఉల్లంగనలకు పాల్పడుతున్నట్లు అదికారులు గుర్తించారు. పరిశుభ్రత లేకపోవడం, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తుండడం, అలాగే ఆహారంలో ఇన్‌సెక్ట్స్‌ కన్పిస్తుండడం వంటి కారణాలతో అధికారులు ఈ రెస్టారెంట్‌ని మూసివేశారు. అధికారుల సూచనల మేరకు రెస్టారెంట్‌లో మార్పులు చేస్తే, తిరిగి రెస్టారెంట్‌ని తెరిచేందుకు అనుమతులిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com