అయోధ్య తీర్పు: అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసిన కేంద్రం

- November 07, 2019 , by Maagulf
అయోధ్య తీర్పు: అన్ని రాష్ట్రాలనూ అలర్ట్ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : చారిత్రాత్మకమైన అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. భద్రతాపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించింది. అంతేకాకుండా సున్నితమైన ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ఆయా రాష్ట్రాల్లో ఈ తీర్పుపై ఎలాంటి గొడవలు చలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 4,000 పారామిలటరీ బలగాలను తలరించి, పరిస్థితిని సమీక్షిస్తోంది.

అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అధికారులకు సెలవులను కూడా రద్దు చేసి, అందరూ విధుల్లో ఉండాలని ఆదేశించారు. ఇక, కొన్ని ముస్లిం సంఘాలు కూడా స్పందిస్తూ... సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో ఎలాంటి తీర్పునిచ్చినా తమకు శిరోధార్యమేనని బుధవారం ప్రకటించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com