దుబాయ్‌ ట్రాఫిక్‌ ఫైన్స్‌పై 75 శాతం డిస్కౌంట్‌

- November 07, 2019 , by Maagulf
దుబాయ్‌ ట్రాఫిక్‌ ఫైన్స్‌పై 75 శాతం డిస్కౌంట్‌

ట్రాఫిక్‌ ఫైన్స్‌ సెటిల్‌మెంట్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా 75 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వాహనదారులకు 75 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన కొత్త స్కీమ్‌ ద్వారా మూడు నెలల్లో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడని వాహనదారులకు అంతకు ముందున్న జరీమానాల్లో 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆరు నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకపోతే 50 శాతం, 9 నెలలపాటు ఉల్లంఘనలకు పాల్పడకుండా వుంటే 75 శాతం, ఏడాది పొడవునా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకపోతే 100 శాతం డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ ప్రోగ్రామ్‌ ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com