సంతృప్తికరంగా లేదు.. అయినా గౌరవిస్తాం: సున్నీ వక్ఫ్ బోర్డు

- November 09, 2019 , by Maagulf
సంతృప్తికరంగా లేదు.. అయినా గౌరవిస్తాం: సున్నీ వక్ఫ్ బోర్డు

న్యూఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ తీర్పు సంతృప్తికరంగా లేదని.. అయినా గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని, ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com