జెడ్డాలో మేజర్‌ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్న సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌

- November 09, 2019 , by Maagulf
జెడ్డాలో మేజర్‌ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్న సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌

జెడ్డా: సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌, మేజర్‌ మిలిటరీ మరియు సెక్యూరిటీ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నారు. యాన్యువల్‌ డ్రిల్‌లో భాగంగా సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌ తమ నైపుణ్యాల్ని చాటి చెప్పారు. మొహమ్మద్‌ బిన్‌ నైఫ్‌ అకాడమీ ఫర్‌ మెరిటైమ్‌ సైన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లైవ్‌ అమ్యూనిషన్‌తో షూటింగ్‌, అరెస్ట్‌ టెక్నిక్స్‌, నైట్‌ ఆంబుష్‌ స్కిల్స్‌ ఇక్కడ అబ్బురపరిచాయి. అకాడమీ అధికార ప్రతినిథి మేజర్‌ మొహమ్మద్‌ అల్‌ తాఖాఫి మాట్లాడుతూ, మూవింగ్‌ టార్గెట్స్‌, స్టాటిక్‌ టార్గెట్స్‌ని షూట్‌ చేయడం కూడ ఈ ఫీల్డ్‌ ట్రెయినింగ్‌లో భాగంగా ఏర్పాటు చేశామని చెప్పారు. అరెస్ట్‌ మరియు ఇన్‌స్పెక్షన్‌ ప్రొసిడ్యూర్స్‌పై కూడా శిక్షణ ఇచ్చామని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com