కువైట్: పరువు తీసిన టిక్ టాక్ వీడియో..మనస్తాపంతో ఉరి
- November 10, 2019
ఏ.పి: తన పై ఆరోపణలు చేస్తూ,వేరోక వ్యక్తి టిక్ టాక్ లో విడియో చేసి దానిని వైరల్ చేయడంతో మనస్తాపం కు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజోలు మండలం శివకోటి పోస్టాఫీసు వీధి కి చెందిన పుచ్చకాయల మోహన కుమార్ (30)ఉపాధి నిమిత్తం కువైట్ దేశం వెళ్లాడు. అక్కడ పని చేసుకుంటూ ఇంటి వద్ద ఉన్న వాళ్ళ అమ్మ కు డబ్బులు పంపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా 2 వేల రూపాయల కువైట్ డబ్బులు దినర్లు చీటిపాడుకుని కనిపించకుండా పరారిలో ఉన్నాడని తన స్నేహితుడు వడ్డి దుర్గారావు టిక్ టాక్ లో మోహన్ కుమార్ ఫోటోలతో విడియో క్రియేట్ చేసి టిక్ టాక్ లో పెట్టడంతో పరువు పోయిందని మనస్తాపం కు గురైన మోహన్ ఈ నెల 3 వ తేదిన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండియన్ ఎంబసీ వారు కువైట్ ఎంబసీ తో మాట్లాడి మోహన్ మృతదేహాన్ని ఇండియా కు రప్పిస్తున్నారు. ఉపాధి కొసం వెళ్ళిన తన కొడుకు ఇలా మృతదేహం గా రావడంతో మృతుని తల్లి విజయ కుమారి విలపిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. దీంతో శివకోటి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







