అమెరికాలో సత్తాచాటిన ప్రవాస భారతీయులు
- November 10, 2019
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రాష్ట్ర స్థాయితోపాటు, స్థానిక ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయులు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. వీరిలో ఒక ముస్లిం మహిళ కూడా ఉన్నారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్ సభ్యురాలిగా గజాలా హష్మీ విజయం సాధించారు. కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికయిన ప్రథమ ముస్లిం మహిళ ఆమే కావడం గమనార్హం. గజాలా కుటుంబం 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి జార్జియాలో స్థిరపడింది. అప్పటికి ఆమె చాలా చిన్నది. ఆమె ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అంతా అమెరికాలో సాగింది. మాజీ అధ్యక్షుడు ఒబామాకు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. శాన్ప్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా మనో రాజు గెలుపొందారు. ఉత్తర కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా రెండో సారి ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









