ఏఎన్ఆర్ అవార్డ్స్.. గెస్ట్‌గా మెగాస్టార్
- November 14, 2019
అక్కినేని ఫ్యామిలీ ప్రతి ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఒక్కో సెలబ్రిటీని ఈ అవార్డ్‌కి ఎంపిక చేస్తూ వస్తున్నారు. అయితే 2017లో రాజమౌళికి ఏఎన్ఆర్ అవార్డ్ దక్కగా, తాజాగా 2018, 2019 సంవత్సరాలకి గాను అవార్డుల జాబితా ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను శ్రీదేవిని, 2019 సంవత్సరానికి గాను రేఖ.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ అందుకోనున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుల కార్యక్రమం నవంబర్ 17న జరగనుండగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు నాగ్ తెలిపారు. ఇక తన సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుందని నాగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..