నిధుల అవకతవకలపై కువైట్ ప్రభుత్వం వైదొలిగింది
- November 16, 2019కువైట్: అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య ఘర్షణ, పార్లమెంట్ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతోపాటు యావత్ తన మంత్రిమండలి రాజీనామా లేఖను కువైట్ రాజుకు అందజేశారు. ప్రభుత్వ పెన్షన్ సంస్థ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకున్న రుణాలపై ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వడ్డీరేటు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత నెలలోనే ఆర్థిక మంత్రి అల్ హజ్రఫ్ రాజీనామా చేశారు. ప్రస్తుత కేబినేట్ కూర్పుపై మంత్రుల మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రభుత్వం రాజీనామా చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సైనిక సహాయ నిధి నుండి దాదాపు 800 మిలియన్ డాలర్లు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేసినట్లు కువైట్ రక్షణ మంత్రి శనివారం చెప్పారు.
"ప్రభుత్వం రాజీనామా చేయడానికి ఇది ప్రధాన కారణం" అని ప్రధాన మంత్రి షేక్ జాబర్ ముబారక్ అల్-సబా తన మంత్రివర్గంతో పాటు వైదొలిగిన రెండు రోజుల తరువాత షేక్ నాజర్ సబా అల్-అహ్మద్ అల్-సబా అన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!