'రొమాంటిక్' సెట్లో అడుగుపెట్టిన రమ్యకృష్ణ
- November 17, 2019
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రొమాంటిక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈమేరకు షూటింగ్ విషయంలో గోవా వెళ్ళడం జరిగింది. 30రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండబోతుంది.కేతికా శర్మ కథానాయికగా అరంగేట్రం చేయగా, అనిల్ పదురి దర్శకత్వం వహిస్తున్నారు.ఇంటెన్సివ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతుండగా, నరేష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ లో భాగంగా ఒక పిక్ బయటపడింది. ఇందులో రమ్యకృష్ణ మరియు ఛార్మి మాట్లాడుకుంటున్నారు. ఛార్మి నిర్మాతగా మారడంతో ఆమె రమ్యకృష్ణనకు కొన్ని సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..