అందుకే `జబర్దస్త్` నుంచి బయటికొచ్చా: నాగబాబు
- November 22, 2019తెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. ఈ షో ఆరంభం నుంచి ఇప్పటివరకు రోజాతోపాటు నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక, ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్టు నాగబాబు స్వయంగా వెల్లడించారు. నేటి (శుక్రవారం) ఎపిసోడ్‌తో `జబర్దస్త్` నుంచి తప్పుకుంటున్నట్టు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన వెల్లడించారు. ` 2013 నుంచి 2019 వరకు `జబర్దస్త్`తో నా ప్రయాణం కొనసాగింది. ఈ ప్రయాణం మరిచిపోలేనిది. నాకు నేనుగా ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. సృజనాత్మక విభేదాల వల్లే బయటకు రావాల్సి వచ్చింది. దీంట్లో ఎవరి తప్పూ లేదు. నాకు అవకాశం ఇచ్చిన `జబర్దస్త్` నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ షోకు వచ్చాను. కామెడీపై నాకు ఉన్న ఆసక్తి చూసి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారు. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా మంచి పారితోషికమే ఇచ్చారు. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. పారితోషికం వల్లే `జబర్దస్త్`ను వదిలేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదు. ఇన్ని రోజులూ ఎంతో సరదాగా ఈ షో నడిచింది. అందుకు మరోసారి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ కార్యక్రమం గురించి నేను ఏనాడూ, ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. వివాదాలు కోరుకోలేదు. `జబర్దస్త్`లో నా ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా పూర్తయింది అనేది త్వరలో వెల్లడిస్తాన`ని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ