తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ లో సాంస్కృతిక ప్రదర్శన

- November 24, 2019 , by Maagulf
తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహ లో సాంస్కృతిక ప్రదర్శన

దోహ:భారతీయ ఉపఖండంలో ప్రత్యేకమైన బహుళ-సాంస్కృతిక ప్రాంతంగా, సాంస్కృతిక కేంద్రంగా ఉద్భవించిన తెలంగాణ ఆటలు, పాటలు, సంస్కృతి మనందరికీ గర్వ కారణం. 

సుమారు 5000 ఏళ్ల సాంస్కృతిక చరిత్రనే కాక  పర్యావరణం మరియు సామాజిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్న ఈ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయడానికి ముందు ఉంటుంది తెలంగాణ జాగృతి.
 
తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని  తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 22, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ , కార్నిష్ లో తమ అధ్భుతమైన కొరియొగ్రఫీ ద్వారా ఖతర్ లో ఎన్నో  కార్యక్రమాలు విజయవంతం కావడంలో క్రుషి చేస్తున్న తెలంగాణ జాగృతి సభ్యులు  ప్రతిభావంతలైన సభ్యులు హరిక ప్రేమ్ మరియు లావణ్య వంశీ  నేత్రుత్వంలో సుధ శ్రీరామోజు ,మమత దుర్గం ,రేణుక కనుమార్లపుడి, దుర్గ ప్రసన్న డాట్ల ,శ్రావణి కొండోజు ,ప్రియాంక తోగిటి ,పద్మిని సారగడం ,శివాని కందిబండ ,  జ్యోతి కొంగల,  హరిప్రియ కొమ్ముల ,ప్రవీణ లక్ష్మి ముకల ,లోకా చందన రెడ్డి ,రాజ రాజేశ్వరి తదితర సభ్యులు మన  సంస్కృతిక ఔన్నత్యాన్ని, విశిష్టతను నృత్య రూపకంలో ఆవిష్కరించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com