కేటీఆర్‌ను కలిసిన కపిల్‌ దేవ్‌

- November 25, 2019 , by Maagulf
కేటీఆర్‌ను కలిసిన కపిల్‌ దేవ్‌

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్లెన్‌ కపిల్‌ దేవ్‌ సోమవారం మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావును జీహెచ్‌ఎంసి కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా ఆయనను మంత్రి కేటీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్‌లో నగరంలో జరిగే గోల్ఫ్‌ టోర్నమెంట్‌కు ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మంత్రి కేటీఆర్‌ను కోరారు. గోల్ఫ్‌టోర్నమెంట్‌కు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్‌ కపిల్‌దేవ్‌కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com