169వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తలైవా
- November 26, 2019
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నారు. త్వరలో పూర్తి రాజకీయాలలోకి వస్తారని భావిస్తున్న రజనీ, తన సినిమాలకి మాత్రం బ్రేక్ వేయడం లేదు. తాజాగా రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ సినిమా చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మరి కొద్ది రోజులలో శివ దర్శకత్వంలో తన 168వ సినిమాని చేయనున్నాడు రజనీకాంత్. డిసెంబర్ లేదా జనవరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. రజనీకాంత్ 169వ చిత్రంకి సంబంధించి తాజాగా ఓ వార్త కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తుంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. ఆయన టేకింగ్ స్టైల్‌తో పాటు కథ కూడా రజనీకి నచ్చడంతో వెంటనే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది. ఇదిలా ఉంటే గౌతమ్ మీనన్.. ప్రముఖ రచయిత గోవింద్ నిహ్లాని రాసిన నవల ఆధారంగా చిత్రం తెరకెక్కించనున్నారని వార్తలు వచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..