మస్కట్:పర్యాటక ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమాన
- November 30, 2019
మస్కట్:పర్యాటక ప్రదేశాల పరిశుభ్రత కోసం మస్కట్ మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. బహిరంగప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను వేయటంపై నిషేధం విధించింది. కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే చెత్తను వేయాలని సూచించింది. 49వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా గత బుధవారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేసింది.
మస్కట్ మున్సిపాలిటీ నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తూ చెత్త, వ్యర్ధాలను బహిరంగ, పర్యాటక ప్రాంతాల్లో వేస్తే OMR 100 జరిమాన విధించనున్నారు. ఒకసారి జరిమాన చెల్లించినా మళ్లీ రెండోసారి కూడా చెత్త వేస్తే ఫైన్ రెండింతలు అవుతుందని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
పబ్లిక్ ప్రాంతాలు, పార్కులు, గార్డెన్లలో చెత్త వేయకూడదని ఈ ఏడాది మొదట్లోనే మస్కట్ మున్సిపాలిటి నిబంధనలను ప్రకటించింది. అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా గత జనవరి నుంచి నిబంధనలను అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాంతల్లో నిబంధనలు పాటించని వారు జరిమానతో పాటు వేసిన చెత్తను తొలగించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..