'పండగ' సినిమా షూటింగ్ పూర్తి
- November 30, 2019
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రతిరోజు పండగే'. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాత-మనవళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తి కానుంది.
ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. నేటితో ఆ పాట షూటింగ్ పూర్తికానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. 'ఈరోజు చిత్రంలోని చివరి పాటను రూపొందిస్తున్నాం. దీంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 20న మీ ముందుకొస్తున్నాం. అనుకున్న సమయానికి, అనుకున్నది అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం. ప్రతిరోజూ పండగే కుటుంబ కథా చిత్రం. వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా సందేశం ఉంటుంది' అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..