కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్

- December 01, 2019 , by Maagulf
కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్

కతర్:తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో జరిగిన కతర్ తెలంగాణ ప్రైమర్ లీగ్ 2019 విజేతగా దోహా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది.గత నెల రోజులుగా జరుగుతున్న ఈ పోటీల్లో 12 జట్లు పాల్గొనగా ఫైనల్లో దక్కన్ చార్జెస్ మరియు దోహా తెలుగు జట్లు తల్పడ్డాయి.దోహా తెలుగు జట్టు దక్కన్ చార్జెస్ జట్టు పై 5 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు బహుమతులు అందజేయటానికి ముఖ్య అతిధిగా ICBF ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్  ICBF ప్రధాన కార్యదర్శి అవినాష్, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్, QPL ఫౌండర్ సిరాజ్ అన్సారీ, శ్రీధర్ అబ్బాగౌని,అశ్వాక్, UKB అధ్యక్షుడు శశిధర్, OFWS అధ్యక్షుడు హుస్సేన్ ,7070 T షర్ట్ ఇబాద్  పాల్గొన్నారు.

గత నెల రోజులుగా ఉదయం నుంచి మైదానంలో పోటీలు నిరవహించిన గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, ప్రేమ్ కుమార్,మహీందర్, ఎల్లయ్య, శ్రీకాంత్,రమేష్,కింగ్ రాజు,తేజ,నాగరాజు,నరేందర్,గంగారదర్,లను వచ్చిన అతిధులు అభినందించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com