`చూసీచూడంగానే` సినిమా ట్రైలర్ విడుదల
- December 03, 2019శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గత చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అసోసియేషన్‌లో విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాత డి.సురేశ్‌బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ గోపీసుందర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంటల్ మదిలో` కెమెరా మెన్ వేద రామన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..