గల్ఫ్ లో ఉన్న తండ్రులకు ఉత్తరాలు రాసే పోటీ
- December 05, 2019
తెలంగాణ:ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు గురువారం (05.12.2019) గల్ఫ్ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమం నిర్వహించారు. తమ తండ్రులు, బంధువులు గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ల గురుంచి ఈ కార్యక్రమంలో వివరిస్తూ కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వి. జయపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో 95 మంది విద్యార్థులున్నారని వీరిలో 50 మంది విద్యార్థుల తండ్రులు గల్ఫ్ దేశాలలో ఉన్నారని అన్నారు. విద్యార్థుల ద్వారా గల్ఫ్ వలసల గురించి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం మంచి ఆలోచన అని సీనియర్ ఉపాద్యాయుడు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు కోటేశ్వర్ రావు, జె. జాస్మిన్, సరోజన, కె. విజయ, డి. విజయ లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయురాలు గాయత్రి అభినందించారు.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ అనే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం, విదేశాల్లో ఉన్న భారతీయులకు వర్తించే నేషనల్ పెన్షన్ సిస్టం అనే పథకం, స్వచ్ఛ భారత్ అనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పాటు రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి విద్యార్థులకు వ్యాస రచనను గల్ఫ్ కు ఉత్తరాలు రాసే విధానంలో పోటీలు నిర్వహిస్తామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఈ సందర్బంగా తెలిపారు.
ఈ ప్రభుత్వ పథకాలలో ఒకదాని గురించి విద్యార్ధి గల్ఫ్ దేశంలో ఉన్న తన తండ్రికి ఉత్తరం రాయాలని, తండ్రి నుండి జవాబు వచ్చిన తర్వాత ఉత్తమ ఉత్తరాలకు బహుమతులు ప్రధానం చేస్తామని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి తెలిపారు. స్మార్ట్ ఫోన్ ల వలన ఉత్తరాలు రాయడం పూర్తిగా మర్చిపోయారని, విద్యార్థులకు ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ప్రవాసి మిత్ర నాయకులు జయపాల్ నల్లాల, జంగిలి జగన్, తునికి రాము తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







