ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు
- December 06, 2019
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లీగల్ విభాగంలో ఈ పోస్టులున్నాయి. మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదో ఓ రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత ఏడాది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 16 చివరి తేదీ. వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) మొత్తం ఖాళీలు- 35ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2020 జనవరి 27
విద్యార్హత- న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (LLB) 55 శాతం మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. వయస్సు- 2019 జనవరి 1 నాటికి 23 నుంచి 30 ఏళ్లు.
వేతనం- రూ.56,000.
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టుల భర్తీకి ఎల్ఐసీ హౌసింగ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







