'మిస్ యూనివర్శ్-2019' గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి

- December 09, 2019 , by Maagulf
'మిస్ యూనివర్శ్-2019' గా నిలిచిన దక్షిణాఫ్రికా సుందరి

అట్లాంటా: దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ మిస్ యూనివర్శ్-2019 కిరీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్ యూనివర్శ్ పోటీలో వివిధ దేశాలకు చెందిన 90 మంది సుందరీమణులు పాల్గొన్నారు. ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టూంజీ అందరినీ ఓడించి విజేతగా నిలిచారు. జోజిబినితో పాటు 20 మంది సుందరీమణులు సెమీ ఫైనల్స్ వరకూ చేరారు. ఈ పోటీలకు బారత్ నుంచి వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వర్తికా సింగ్ టాప్-10లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com