దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ
- December 11, 2019
దుబాయ్: ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఈ నెల 12వ తేదీన దుబాయ్ లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించనున్నారు. రాణీ నటించిన తాజాగా చిత్రం 'మర్దానీ 2' విడుదల సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె దుబాయ్ సందర్శనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులు రాణీ ముఖర్జీకి లా మెర్లోని స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ఆతిథ్యం ఇవ్వనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డీరా సిటీ సెంటర్లోని వోక్స్ సినిమాస్‌లో దుబాయ్ పోలీసుల కోసం ప్రత్యేక షోను కూడా ఏర్పాటు చేసింది.
2014లో విడుదలైన 'మర్దానీ'కి సీక్వెల్‌గా వస్తున్న 'మర్దానీ 2' ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాణీ ముఖర్జీ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు సూపరింటెండెంట్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. గోపీ పుత్రన్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పటికే విడుదలైన 'మర్దానీ 2' ట్రైలర్ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..