ఆకట్టుకుంటున్న 'హీరో' ట్రైలర్
- December 13, 2019యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. 'హీరో'..
'యాక్షన్ కింగ్' అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
సూపర్ హీరోగా శివ కార్తికేయన్ కనిపించగా అర్జున్, అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విద్య, వైద్యం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. విశాల్ నటించిన 'ఇరుంబు తిరై' (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ 'హీరో' చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో రూపొందించారని కోలీవుడ్ సమాచారం.
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. డిసెంబర్ 20న 'హీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..