రస్ అల్ ఖైమాలో ఫుట్ కార్నివాల్ ప్రారంభం
- December 14, 2019
రస్ అల్ ఖైమా ఫుడ్ కల్చర్ అద్దంపట్టేలా ఫుడ్ కార్నివాల్ ప్రారంభమైంది. పాతతరం రెస్టారెంట్ల రుచులతో రస్ అల్ ఖైమా వాసులను ఈ ఫుడ్ కార్నివాల్ అలరించనుంది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సక్ర్ బిన్ సౌద్ అల్ ఖాసిమి గురువారం మినా అల్ అరబ్ వద్ద RAK ఫుడ్ కార్నివాల్ ప్రారంభించారు. యూఏఈ ఇయర్ ఆఫ్ టోలరెన్స్ థీమ్ తో పాటు రస్ అల్ ఖైమా స్థానిక అహార సంస్కృతిని చాటేల ఫుడ్ కార్నివల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నెల 21వ వరకు కొనసాగే ఈ ఫుడ్ కార్నివాల్ ప్రతీ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అతిథులకు నోరూరించే రుచులతో పాటు కుటుంబసభ్యులు అందర్ని అహ్లాదపరిచేలా కల్చరల్ షోస్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!