సొంత వైద్యం వద్దే వద్దు

- May 17, 2015 , by Maagulf
సొంత వైద్యం వద్దే వద్దు

వంటింట్లో లభించే అనేక రకాలైన దినుసులు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. సొంతింటి వైద్యం అంటే, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని వంటింటి వైద్యం అని మాత్రమే. కానీ మందుల్ని వాడేటప్పుడు మాత్రం సొంత వైద్యం పనికిరాదు. డాక్టర్‌ సలహా లేనిదే ఎలాంటి మందులైనా ఉపయోగించడం ప్రమాదకరమే అవుతుంది. జ్వరానికీ, తలనొప్పికీ, చిన్న చిన్న విషయాలకీ సొంత వైద్యాన్ని ఉపయోగించేస్తుంటాం. ముందస్తుగా వైద్యుల సలహా తీసుకుని పారాసెట్‌మాల్‌, పెయిన్‌ కిల్లర్స్‌ వంటివాటిని అరుదుగా ఉపయోగిస్తే కొంతవరకూ ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒక్కరోజుకి మించి పారాసెట్‌మాల్‌ అయినా, పెయిన్‌ కిల్లర్స్‌ అయినా ఉపయోగించినప్పుడు అది ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే మందుల్ని వాడేటప్పుడు చిట్కా వైద్యం తరహాలో ఉపయోగించేయకూడదు. ఒక్కోసారి మందుల వాడకంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా కొత్త రోగాలు మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. అందుకే సొంత వైద్యం అన్న మాటకి టాటా చెప్పేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com