షార్జాలో పూర్తైన రోడ్డు అభివృద్ధి పనులు

- December 14, 2019 , by Maagulf
షార్జాలో పూర్తైన రోడ్డు అభివృద్ధి పనులు

షార్జాలోని అబు షాఘర రహదారులు కొత్త రూపు సంతరించుకున్నాయి. షార్జా రోడ్స్&ట్రాన్స్ పోర్ట్ అథారిటీ-SRTA చేపట్టిన అంతర్గత రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తైయ్యాయి.  SRTA ఛైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి మాట్లాడుతూ' ఎమిరేట్ రహదారులను మరింత
మెరుగుపర్చాలనే వార్షిక ప్రణాళికలో భాగంగా అబు షాఘరలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. రోడ్ల విస్తరణ, అభివృద్ధి, అన్ని ఎమిరేట్ రహదారులను అనుసంధానం చేసేలా రోడ్ల అధునీకరణే రోడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం. తద్వారా ఎమిరైట్స్ వాహదారులు సౌకర్యవంతంగా
సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రధాన్యత ఇస్తున్నాం' అని అన్నారు.  

రహదారుల నిర్వహణ డైరెక్టర్ మోహ్ సెన్ బల్వాన్ మాట్లాడుతూ అబు షాఘర అంతర్గత రహదారుల్లో సరికొత్త మార్పులు చేపట్టామని అన్నారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాహనాల రాకపోకలు కొనసాగించే మెరుగైన రహదారులు ఏర్పాటు చేశామని వివరించారు.  రోడ్ల విస్తరణ కోసం యూజ్డ్ కార్ల షోరూమ్ స్థలాన్ని సేకరించినట్లు SRTA అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తో రోడ్లపై రద్దీ తగ్గటమే కాకుండా, పీక్ అవర్స్ లో కూడా లింక్ రోడ్ల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ కు సులువుగా ఉంటుందని అన్నారు. రహదారుల చేపట్టిన విస్తరణ కారణంగా వాహనదారులు అయోమయానికి గురికాకుండా ఎక్కడిక్కడ మార్కింగ్ లైన్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com