కువైట్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి
- December 15, 2019
కువైట్: ఫహహీల్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఇద్దరు మహిళల్ని బలి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కువైటీ పౌరుడొకరు మినా అబ్దుల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన వాహనం ఈ ప్రమాదానికి కారణమైనట్లు లొంగిపోయిన వ్యక్తి పోలీసులకు తెలిపారు. మృతి చెందిన మహిళలు ఓ ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మృతదేహాల్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం తరలించారు. కాగా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హమిద్ అల్ అజ్మి, మృతి చెందిన టీచర్ల ఆత్మశాంతి కలగాలని ఆకాంక్షించారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!