మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఇ-సెక్యూరిటీ పాస్‌ సిస్టమ్‌

- December 16, 2019 , by Maagulf
మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ఇ-సెక్యూరిటీ పాస్‌ సిస్టమ్‌

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌, ఇ-సెక్యూరిటీ పాస్‌ సిస్టమ్‌ని మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఓ ప్రకటనను ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ విడుదల చేయడం జరిగింది. స్మార్ట్‌ గవర్నమెంట్‌లో భాగంగా ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి కొత్త ఇ-సెక్యూరిటీ పాస్‌ సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. సెక్యూరిటీ క్లియరెన్స్‌ ప్రాసెస్‌, అలాగే ఎయిర్‌ పోర్ట్‌ సెక్యూరిటీ పాస్‌ల జారీ వంటివి ఈ విధానం ద్వారా మరింత సులభతరం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com