అకౌంట్ నుంచి 4.9m దిర్హామ్ లు గల్లంతు..తిరిగి చెల్లించాలని దుబాయ్ కోర్టు ఆసక్తికర తీర్పు
- December 17, 2019
దుబాయ్:ఓ బ్యాంకు మాజీ ఉద్యోగి, మరో అఫ్రికన్ కలిసి ఓ ఖాతాదారుడి అకౌంట్ నుంచి 4.9బిలియన్ల దిర్హామ్ లను గుట్టుచప్పుడు కాజేశారు. కానీ, ఖాతాదారుడి ఫిర్యాదుతో మోసం బయటపడింది. విచారణ తరువాత బ్యాంకు మాజీ ఉద్యోగి, అఫ్రికన్ కలిసి మోసం చేసినట్లు రుజువు కావటంతో దుబాయ్ కోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. మోసపోయిన బాధితుడి ఖాతాలో సదరు బ్యాంకు 4.9 బిలియన్ దిర్హామ్ లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. నిందితులు ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు బ్యాంకు నుంచి మోసపూరితంగా విత్ డ్రా చేసిన 4.9 బిలియన్ దిర్హామ్ లను 12% వడ్డీతో తిరిగి బ్యాంకులో జమ చేయాలని తీర్పు వెలువరించింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ రికార్డుల ప్రకారం, బాధితుడు కొన్నాళ్ల పాటు యూఏఈ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. దీంతో అతని బ్యాంక్ అకౌంట్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా నిరుపయోగంగా ఉంది. అకౌంట్ వివరాలను గమనించిన బ్యాంక్ మాజీ ఉద్యోగి అకౌంట్ లో సొమ్ము కాజేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకు ఓ అప్రికన్ సాయం తీసుకున్నాడు. అఫ్రికన్ వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో బాధితుడి పేరు మీద సిమ్ కార్డు సంపాదించారు. ఆ తర్వాత తనని తాను అకౌంట్ హోల్డర్ గా నటిస్తూ బ్యాంకును ఆశ్రయించాడు. బ్యాంక్ మాజీ ఉద్యోగి, అఫ్రికన్ కలిసి నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకంతో అకౌంట్ నుంచి 4.6 బిలియన్ దిర్హామ్ లను విత్ డ్రా చేసుకున్నారు.
అయితే..2017లో బాధితుడు తిరిగి యూఏఈ చేరుకున్నాక తన అకౌంట్ లో డబ్బులు లేవని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు బ్యాంకు మాజీ ఉద్యోగి, అఫ్రికన్ మోసానికి పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టిన దుబాయ్ కోర్టు నిందితులు ఇద్దరు నకిలీ డాక్యుమెంట్ల తయారీ, సంతకాల ఫోర్జరీ, నమ్మకద్రోహం, కుట్రపూరిత మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఖాతాదారుడు నష్టపోయిన 4.9 బిలియన్ దిర్హామ్ లను తిరిగి చెల్లించాలని బ్యాంకు ఆదేశించింది. అదే సమయంలో మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బ్యాంకు నుంచి కాజేసిన డబ్బును 12% వడ్డీతో తిరిగి డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







