ఇథ్రా ఆర్ట్‌ ప్రైజ్‌ గెల్చుకున్న యువ సౌదీ ఆర్టిస్ట్‌

- December 17, 2019 , by Maagulf
ఇథ్రా ఆర్ట్‌ ప్రైజ్‌ గెల్చుకున్న యువ సౌదీ ఆర్టిస్ట్‌

దహ్రాన్‌: సౌదీ ఆర్టిస్ట్‌ ఫహాద్‌ బిన్‌ నైఫ్‌, మూడవ ఇథ్రా ఆర్ట్‌ ప్రైజ్‌ని గెల్చుకున్నారు. 'రఖ్‌మ్‌' పేరుతో రూపొందించిన ఆర్ట్‌కి గాను ఈ బహుమతిని దక్కించుకున్నాడీ సౌదీ యువకుడు. కింగ్‌ అజీజ్‌ సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ కల్చర్‌ (ఇథ్రా), ఆర్ట్‌ దుబాయ్‌ సహకారంతో ఈ ఆర్ట్‌ వర్క్‌ని 14వ ఆర్ట్‌ దుబాయ్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. మార్చ్‌ 25 నుంచి 28 వరకు ఈ ఆర్ట్‌ దుబాయ్‌ జరుగుతుంది. ఇథ్రా ఆర్ట్‌ ప్రైజ్‌ 2017లో ప్రారంభమయ్యింది. యువ సౌదీ ఆర్టిస్ట్‌లను ప్రమోట్‌ చేయడమే ఈ ఇథ్రా లక్ష్యం. స్థానిక అలాగే అంతర్జాతీయ క్రియేటివ్‌ టాలెంట్స్‌ని వెలికి తీయడమే లక్ష్యంగా ఇథ్రా చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని బిన్‌ నైఫ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com