4,000 ఒమన్‌ రియాల్స్‌కి పెరిగిన హెల్త్‌ కవర్‌

- December 17, 2019 , by Maagulf
4,000 ఒమన్‌ రియాల్స్‌కి పెరిగిన హెల్త్‌ కవర్‌

మస్కట్‌: ఇన్‌పేషెంట్లుగా హెల్త్‌ కవర్‌ పొందే ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంప్లాయిస్‌కి, ఆ కవర్‌ని 4,000 ఒమన్‌ రియాల్స్‌కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒమనీ మరియు ఫారిన్‌ నేషనల్స్‌కి ఇది వర్తిస్తుంది. ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసే వారికి, ఎక్స్‌పాట్‌ రెసిడెంట్స్‌ కుటుంబీకులకీ, అలాగే ఒమన్‌ టూరిస్ట్‌లకీ, డొమెస్టిక్‌ వర్కర్స్‌కీ ఈ కవర్‌ వర్తిస్తుంది. ఔట్‌ పేషెంట్స్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కాస్ట్స్‌ కింద 500 ఒమన్‌ రియాల్స్‌ క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. కొత్త అమెండ్‌మెంట్స్‌ ద్వారా ఈ మార్పులు జరిగాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలూ లేకుండా ఇన్స్యూరర్స్‌కి సర్వీసులు అందడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com