పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

- December 17, 2019 , by Maagulf
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష

పాకిస్తాన్:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్‌కు లాహోర్ హైకోర్టు తీవ్ర దేశద్రోహం కేసులో మరణశిక్ష విధించింది.

ప్రస్తుతం ముషరఫ్ పాకిస్తాన్‌లో లేరు. ఆయన దుబాయ్లో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ముషరఫ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి ఒక వీడియో విడుదల చేశారు. విచారణ కమిటీ తన వద్దకు వచ్చి ఆరోగ్య పరిస్థితిని చూడాలని ఆయన ఆ వీడియోలో కోరారు.

రాజ్యాంగ అవహేళన, తీవ్ర దేశద్రోహం కేసుల గురించి మాట్లాడిన ఆయన "ఈ కేసు పూర్తిగా నిరాధారమైనది. దేశద్రోహం విషయం పక్కనపెట్టండి, నేను ఈ దేశానికి ఎంతో సేవలు అందించాను. యుద్ధంలో పోరాడాను. పదేళ్లు దేశానికి సేవ చేశాను" అని అన్నారు.

లాహోర్ హైకోర్టు ముగ్గురు సభ్యుల బెంచ్ మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది.
పాకిస్తాన్ చరిత్రలో రాజ్యాంగ అవహేళన కేసులో విచారణను ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ముషరఫ్.

నిజానికి, 2013 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అనంతరం మాజీ అధ్యక్షుడు అయిన పర్వేజ్ ముషరఫ్‌పై రాజ్యాంగాన్ని అవమానించారనే కేసు నమోదైంది.

ఈ మాజీ సైన్యాధ్యక్షుడికి వ్యతిరేకంగా మరో తీవ్ర దేశద్రోహం కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టుకు నలుగురు చీఫ్‌ జస్టిస్‌లను మార్చారు.

నిందితుడు పర్వేజ్ ముషరఫ్ తనపై ఆరోపణలు నమోదైనప్పుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు.

ఈలోపు, 2016 మార్చిలో అనారోగ్య కారణాలు చూపించి ముషరఫ్ విదేశాలకు వెళ్లారు.

అప్పుడు అధికారంలో ఉన్న ముస్లిం లీగ్(నూన్) ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌ నుంచి ఆయన పేరును తొలగించింది. ఆ తర్వాత ఆయన దేశం వదిలి వెళ్లడానికి అనుమతించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com