వివాహినికి ముందు వైద్య పరీక్షలతో మేలు

- December 18, 2019 , by Maagulf
వివాహినికి ముందు వైద్య పరీక్షలతో మేలు

ఒమన్‌: యంగ్‌ ఒమనీస్‌, వివాహానికి ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ మేరకు మెడికల్‌ చెకప్స్‌ తాలూకు ప్రాముఖ్యతను వివరించింది. ఒమన్‌లో జన్యు సంబంధిత బ్లడ్‌ డిసీజెస్‌ని తగ్గించడానికి ఈ పరీక్షలు ఉపకరిస్తాయని అధికార యంత్రాంగం చెబుతోంది. వైద్య పరీక్షల కోసం ఎవరైతే వస్తారో, వారికి మాత్రమే ఆ పరీక్షల వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. 10 మంది ఒమనీయుల్లో ఆరుగురికి జన్యు సంబంధిత డిజాస్టర్స్‌ వుంటున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. దేశంలో జన్యు సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఈ వైద్య పరీక్షలు ఉపకరిస్తాయి. వైద్య పరీక్షల ద్వారా సమన్యను ముందే గుర్తించి, తగిన చికిత్స అందించడానికి వీలవుతుంది. అదే సమయంలో, కొత్తగా పుట్టే పిల్లలకు జన్యు సమస్యలు రాకుండా చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com