ఐపీఎల్ 2020 ఫైనల్ లిస్ట్...
- December 20, 2019
ఐపీఎల్ 2020 ఆక్షన్ ముగిసింది. 32 అంతర్జాతీయ ప్లేయర్లు.. 30 యువ క్రికెటర్లు వెరసి మొత్తంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ వేలంలో కంగారూల హవా సాగింది. ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్(15.50 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది వేలంలో అతడ్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా 11 మందిని తీసుకోగా.. కోల్‌కతా, పంజాబ్‌లు 9 మందిని.. ఢిల్లీ 8.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ చెరో ఏడుగురిని.. చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేసింది.
ఫ్రాంచైజీల వారీగా లిస్ట్ ఇలా ఉంది…
చెన్నై సూపర్ కింగ్స్: సామ్ కరన్, పీయుష్ చావ్లా, జాష్ హేజిల్‌వుడ్, సాయి కిషోర్
ఢిల్లీ క్యాపిటల్స్: జేసన్ రాయ్, క్రిస్ వోక్స్, అలెక్స్ క్యారీ, షిమ్రన్ హెట్‌మయర్, మోహిత్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, మార్కస్ స్టొయినిస్, లలిత్ యాదవ్
కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, సిద్ధార్థ్, క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్, ప్రవీణ్ తంబీ, నిఖిల్ నాయక్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: గ్లెన్ మాక్స్‌వెల్, షెల్డన్ కాట్రెల్, దీపక్ హూడా, ఇషాన్ పొరెల్, రవి బిష్ణోయ్, జేమ్స్ నీషమ్, క్రిస్ జోర్డాన్, తజిందర్ దిల్లాన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్
ముంబయి ఇండియన్స్: క్రిస్ లిన్, నాథన్ కౌల్టర్ నైల్, సౌరభ్ తివారి, మోసిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, జాషువా ఫిలిప్, కేన్ రిచర్డ్‌సన్, పవన్ దేశ్‌పాండే, డేల్ స్టెయిన్, షష్‌బాజ్ అహ్మద్, ఇసురు ఉడన
రాజస్థాన్ రాయల్స్: రాబిన్ ఉతప్ప, జయ్‌దేవ్ ఉనద్కత్, యశస్వి జైశ్వాల్, అనూజ్ రావత్, కార్తిక్ త్యాగి, ఆకాశ్ సింగ్, డేవిడ్ మిల్లర్, ఒషానె థామస్, అనిరుధ్ జోషి, ఆండ్రూ టై, టామ్ కరన్
సన్‌రైజర్స్ హైదరాబాద్: విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలెన్, అబ్దుల్ సమద్, సంజయ్ యాదవ్, సందీప్ బవనక
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







