ఉపరాష్ట్రపతి చేతుల మీదగా ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్!...
- December 23, 2019
ఢిల్లీ:భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్రం అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతోంది. చలన చిత్ర రంగంలో ప్రతిభని కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతో పాటు నటీనటులకు జాతీయస్థాయిలో అవార్డులను అందజేస్తున్నారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తారలు అవార్డులు అందుకుంటున్నారు. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా గుజరాత్ సినిమా 'హెల్లరో' నిలవగా.. 'ఉరి' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్, 'అంధాధున్'లో నటించిన ఆయుష్మాన్ ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నా.
మహానటి' చిత్రంలో నటించిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటి అవార్డు వరించింది. ఈ మేరకు అవార్డు తీసుకోవడానికి స్టేజ్ పైకి వెళ్లిన ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇది ఇలా ఉండగా.. ఈ వేడుకలో సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకోవాల్సివుంది. కానీ ఆయన అనారోగ్యం కారణంగా ఈవెంట్ కి హాజరు కాలేకపోతున్నానని ఆదివారం రాత్రి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..