ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం

- December 24, 2019 , by Maagulf
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం

ఆటోమేటెడ్‌ యాక్సిడెంట్‌ వెహికిల్‌ ఎమర్జన్సీ కాల్స్‌కి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అబుదాబీ పోలీస్‌ - ఎమర్జన్సీ సెంటర్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇ-కాల్‌ సిస్టమ్స్‌ని వాహనాల్లో ఏర్పాటు చేయడం ద్వారా, ఆయా వాహనాలు ప్రమాదానికి గురైన వెంటనే సెంట్రల్‌ రూమ్‌కి సమాచారం అందుతుంది. 2021 నుంచి వచ్చే అన్ని వాహనాలకు ఈ సిస్టమ్‌ని అనుసంధానం చేస్తారు. టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఎమర్జన్సీ సమయాల్లో ఈ సిస్టమ్‌, లొకేషన్‌ వివరాలు అలాగే వాహనం వివరాలు, దాంతోపాటుగా ఫ్యూయల్‌ టైప్‌, వాహనంలో ఎంతమంది ప్రయాణీకులున్నారనే విషయాల్ని పోలీసులకు తెలియజేస్తుంది. ఎమిరేట్స్‌ అథారిటీ ఫర్‌ స్టాండర్‌డైజేషన్‌ అండ్‌ మిటియరాలజీ అలాగే పోలీస్‌ అథారిటీస్‌తో కలిసి టిఆర్‌ఎ ఈ 'ఈకాల్‌' సిస్టమ్‌ని అభివృద్ధి చేశాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com