కువైట్:సోషల్ మీడియాలో వీసా ట్రేడింగ్ ప్రవాసీయులే టార్గెట్
- December 25, 2019
కువైట్:సోషల్ మీడియా వేదికగా చట్టవిరుద్ధంగా వీసా ట్రేడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇల్లీగల్ గా జరిగే వీసా అమ్మకాలను తగ్గించేందుకు ఓ వైపు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రయత్నిస్తుంటే..విసా కొనుగోలు, కువైట్ లోకి ఎంట్రీ అవుతున్న వారు పెరిగిపోతూనే ఉన్నారు. కొందరు వీసా ట్రేడర్లు వాటి అమ్మకాలనే బతుకుదెరువుగా చేసుకున్నారు. తక్కువ ధర వీసాలను వలసదారులకు ఎక్కువ మొత్తం అమ్ముతున్నారు. కొన్ని బోగస్ కంపెనీలు ఇదే పనిగా ఇంటర్నల్ గా స్పాన్సర్ వీసాలను ప్రొవైడ్ చేస్తాయి. ఇందుకు 150 కువైట్ దినార్ లను వసూలు చేస్తున్నాయి.
అయితే..సోషల్ మీడియా వేదికగా ఈ వీసా ట్రేడింగ్ బిజినెస్ ప్రచారం జోరందుకుంటోంది. స్పాన్సర్ వీసాల కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ గా చేసుకొని ఫేస్ బుక్ లో యాడ్స్ పోస్ట్ చేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు గుర్తించారు. గవర్నమెంట్, ప్రైవేట్, చిన్న ప్రాజెక్టుల్లో వీసా కావాలంటే టైం పీరియడ్ ను బట్టి రేట్ ఉంటుంది. ఒక ఏడాదికి KD 500, రెండు సంవత్సరాల టైం పీరియడ్ ఉంటే KD 750 ఛార్జ్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ పర్మిషన్ ఉన్న వీసాకు KD 1000కు మించి ధర ఉంటుంది. ఈ ఫేక్ కంపెనీలు రోజులో నాలుగు గంటలు మాత్రమే పని చేస్తాయని అధికారులు గుర్తించారు. హవాలీ, ఖైతాన్ లోని కమర్షియల్ సెంటర్స్ మార్నింగ్, ఈవినింగ్ 2 గంటలు మాత్రమే ఆపరేట్ చేస్తారు. సోషల్ మీడియాలోనే ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకుంటారని అధకారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!







