9000 ఉచిత మీల్స్: దుబాయ్ న్యూ వరల్డ్ రికార్డ్
- December 25, 2019దుబాయ్:బెయిట్ అల్ ఖాయిర్ సొసైటీ మరియు దుబాయ్ ఇఎ్వస్ట్మెంట్ కంపెనీ సంయుక్తంగా 8,997 ఉచిత మీల్స్‌ని లో ఇంకమ్ వర్కర్స్‌కి అందించడం ద్వారా సరికొత్త వరల్డ్ రికార్డ్‌ని సృష్టించడం జరిగింది. కేవలం మూడు గంటలోనే ఈ అరుదైన ఘనత సాధించారు. దుబాయ్ ఇన్వెస్టిమెంట్ ఆపర్క్ ఈ ఫంక్షన్‌ని నిర్వహించింది. లో ఇంకమ్ వర్కర్స్ (తక్కువ ఆదాయం గల కార్మికులు) కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బెయిట్ అల్ ఖాయిర్ సొసైటీ డైరెక్టర్ జనరల్ అబ్దీన్ తహెర్ అల్ అవధి మాట్లాడుతూ, సమాజంలో తమవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మొదట 7,500 మీల్స్‌ని 8 గంటల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారనీ, అయితే కేవలం 52 నిమిషాల్లోనే 8,997 మీల్స్‌ని పంచి పెట్టగలిగారని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికార అడ్యుడికేటర్ ప్రవీణ్ పటేల్ చెప్పారు. పంపిణీ చేసిన ఆహార పదార్థాలన్నీ చాలా నాణ్యమైనవని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు