ప్రవాస భారతీయులకు అలర్ట్:డిసెంబర్ 31లోగా ఆధార్ తో పాన్ కార్డ్ లింక్ చేయాల్సిందే
- December 28, 2019
బ్యాంకు లావాదేవీలు నిర్వహించే ప్రతీ ఒక్కరు పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకునేందుకు డెడ్ లైన్ గడువు ముంచుకొస్తోంది. ప్రవాస భారతీయులు, ఇండియన్ పౌరులు ఈ నెల 31లోగా ఖచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని సెంటల్ర్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT(ఇండియా) సూచించింది. డెడ్ లైన్ లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకుంటే ఆ పాన్ కార్డును పని చేయనట్లుగానే భావిస్తామని CBDT హెచ్చరించింది.
భారత ఆదాయపు పన్ను చట్టం 1961 ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు ఈ ఏడాది మార్చిలోనే ఆధార్ తో పాన్ కార్డు లింక్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం సవరణలు చేసింది. తొలుత మార్చి 31వరకు డెడ్ లైన్ విధించినా..గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఆ తర్వాత మరో అవకాశం కల్పిస్తూ డెడ్ లైన్ ని డిసెంబర్ 31వరకు ఎక్స్ టెండ్ చేసింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!