పొగమంచు కారణంగా ఎదురెదురుగా ' ఢీ ' కొన్న 93 వాహనాలు - 23 మంది క్షతగాత్రులు

- January 16, 2016 , by Maagulf
పొగమంచు కారణంగా ఎదురెదురుగా ' ఢీ '  కొన్న  93 వాహనాలు - 23 మంది క్షతగాత్రులు

దట్టమైన పొగమంచు పలు రోడ్డు ప్రమాదాలకి ముఖ్య కారణమైంది. ఎదురుగా వచ్చే వాహనాన్ని సమీపంలోనికి వచ్చేవరుకు వాహనాన్ని నడిపేవారు గుర్తించలేక పోవడంతో అబూధాబి రహదారిపై వివిధ వాహనాలు  ' ఢీ ' కొని ఒక కుప్ప మాదిరీగా తయరయ్యయి. ఈ ప్రమాదాలలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమ్ఘ్హతన్ గూర్చిన సమాచారం తెలియగానే, ట్రాఫిక్ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని ఆయా వాహనాల ప్రక్షాళన చర్యలు చేపట్టారు. దీంతో మరికొన్ని ప్రమాదాలు జరగకుండా, నిలువరించగలిగెమని అబూధాబి పోలీస్ ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీఫా మొహమద్ ముబారక్ అల్ ఖిలే తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలలో తొలుత అల్ సద్స్వెఇహన్  వంతెన సమీపంలో ఐదు వాహనాలు ఒకదానినొకటి  ' ఢీ '  కొట్టుకున్నాయి. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలో  రెండవ ప్రమాదంలో 69 కార్లు ఒకదానినొకటి  ' ఢీ '  కొట్టుకున్నాయి. 3 వ సంఘటనలో  8 కార్లు ఎదురెదురుగా గుద్దుకోన్నాయి. అలాగే  నాల్గవ ప్రమాదం  సైతం ఇదే మార్గంలో బుసంర వంతెన సమీపంలో 14 కార్లు ఒకదానినొకటి  ' ఢీ '  కొట్టుకున్నాయని అంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రానున్నరోజులలో ఈ ప్రాంతాలలో దట్టమైన పొగమంచుతో పాటు వర్షాలు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాహనచోదకులు సరైన విపత్తు లైట్ లను ఉపయోగించకుండా మార్గసూచిలను పరిశీలించకుండా  ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ప్రమాదమని సంబంధిత శాఖాదికార్లు వాహనదార్లను హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com