నిర్మాతపై హీరోయిన్ దాడి
- December 28, 2019
అర్థరాత్రి ఓ నిర్మాతపై మద్యం బాటిల్ విసిరికొట్టి హల్‌చల్ చేసింది హీరోయిన్ సంజనా. ప్రస్తుతం ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సంజనా గిల్‌రాణి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. టాలీవుడ్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినా.. టాప్ హీరోలతో చేసింది. గతకొద్ది రోజుల నుంచి దక్షిణాది హీరోయిన్ సంజనా గల్‌రాణి, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌ల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 22వ తేదీ ఆదివారం వారిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.
రిచ్‌మండ్‌టౌన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఇరువురూ గొడవపడ్డారు. ఏకంగా మద్యం బాటిల్‌ను వందనా జైన్‌పై.. సంజనా విసిరినట్టు తెలుస్తోంది. దీంతో.. సంజనాపై వందనా కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే.. సినిమా రంగానికి చెందిన పలువురు వీరి మధ్య సంధి కుదర్చడంతో గొడవ సద్దుమణిగింది. అయితే.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది నిజం. మేము పాత స్నేహితులమే.. అందుకే గొడవను రాజీ చేసుకున్నామని ఆమె చెప్పుకొచ్చింది. కథ చర్చించుకుంటున్న విషయంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో ఈ గొడవ జరిగింది.
అయితే.. నిర్మాత వందనా జైన్‌పై మాత్రం సంజనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె వద్ద దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తి ఉందని, దీనిపై సంబంధింత అధికారులు స్పందించాలని ఆమె కోరింది. వివిధ మార్గాల ద్వారా ఆమె డబ్బును సంపాదిస్తోందని.. అసలు వందనా అన్ని కోట్లు ఎలా సంపాదించిందో విచారణ జరపాలని సంజనా సదరు అధికారులను కోరింది సంజనా.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..