రేషన్ కార్డులు, ఓటర్ లిస్ట్ నుండి వలస కార్మికుల పేర్ల తొలగింపుపై పరిశీలన

- December 31, 2019 , by Maagulf
రేషన్ కార్డులు, ఓటర్ లిస్ట్ నుండి వలస కార్మికుల పేర్ల తొలగింపుపై పరిశీలన

తెలంగాణ:పల్లె ప్రగతి కార్యక్రమం సందర్బంగా నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ లో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ వలంటీర్లు సోమవారం (30.12.2019) గల్ఫ్ కార్మికుల ఇంటింటికి వెళ్లి  కుటుంబ సభ్యులను కలసి ఆత్మీయంగా పలకరిస్తూ క్షేమ సమాచారాలను  అడిగి తెలుసుకున్నారు. 

ప్రవాసి మిత్ర నిర్మల్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రోహిత్ అంగర్వార్, కడెం మండల వలంటీర్ సౌడారపు నరేష్, గ్రామ పంచాయతి కారొబార్ మాదాసు రాజన్న వలస కార్మికుల కుటుంబ సభ్యులను ఇంటింటా కలిసి రేషన్ కార్డులు, ఓటర్ లిస్ట్ నుండి వలస కార్మికుల పేర్ల తొలగింపుపై పరిశీలన జరిపారు. 

గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు  నెలసరి రూ.15 వేల కంటే తక్కువ ఆదాయం కలిగి, 18 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే.. అసంఘటితరంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ అనే పెన్షన్ పథకంలో చేరవచ్చునని రోహిత్ అంగర్వార్ ఈ సందర్బంగా తెలిపారు.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఉన్న వలస కార్మికులు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్ పి ఎస్) లో చేరవచ్చునని, వివరాలకు http://www.npstrust.org.in/sites/default/files/NRI_eNPS_FAQ.pdf వెబ్ సైటును సందర్చించాలని ఆయన అన్నారు. 

గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెల్లేవారు రూ.325 చెల్లించి  రూ.10 లక్షల విలువైన ప్రవాసి భారతీయ బీమా యోజన అనే ప్రమాద బీమా పాలసీ పొందవచ్చునని  ప్రవాసి మిత్ర వలంటీర్లు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com