సౌదీ పౌరుడిని మోసం చేసిన సూపర్‌ మార్కెట్‌ వర్కర్‌

- January 02, 2020 , by Maagulf
సౌదీ పౌరుడిని మోసం చేసిన సూపర్‌ మార్కెట్‌ వర్కర్‌

బహ్రెయిన్‌: ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న వర్కర్‌, అక్కడికి సిగరెట్‌ ప్యాకెట్‌ కొనేందుకు వచ్చిన సౌదీ అరేబియా సిటిజన్‌ని మోసం చేశాడు. 2.2 బహ్రెయినీ దినార్స్‌ ఖరీదైన సిగరెట్‌ ప్యాకెట్‌ కోసం 3 బహ్రెయినీ దినార్స్‌ వసూలు చేశాడు సదరు కార్మికుడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ బహ్రెయినీ సిటిజన్‌ తన ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించడం జరిగింది. నిందితుడ్ని, ఈ విషయమై బహ్రెయినీ సిటిజన్‌ నిలదీశారు కూడా. అనంతరం, అధికారులు ఆ సూపర్‌ మార్కెట్‌లో సోదాలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, ఆ సూపర్‌ మార్కెట్‌ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com