శనివారాల్లో ఇకపై అందుబాటులో వుండని ముహరాక్ బ్రాంచ్ ఐడీ కార్డ్ సర్వీస్ సెంటర్
- January 03, 2020
మనామా: ఇన్ఫర్మేషన్ అండ్ ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), ఇకపై ముహరాక్‌లోని సీఫ్ మాల్లోని తమ బ్రాంచ్, ఇకపై శనివారాల్లో అందుబాటులో వుండదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు సాధారణంగానే ఇక్కడ సేవలు అందుతాయని ఐజిఎ పేర్కొంది. ఇప్పటిదాకా ఈ బ్రాంచ్‌లో శనివారం కూడా సేవలు అందుతున్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు శనివారం సేవల్ని నిలుపుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది ఐజిఎ. 2019 సెకెండ్ హాఫ్‌లో శనివారాల్లోనే 11,000కి పైగా ఐడీ చిప్ అప్డేటింగ్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేసినట్లు ఐజిఎ డైరెక్టర్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ పాపులేషన్ రిజిస్ట్రీ షేక్ సబాహ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. కాగా, జులై 13, 2019న ఐజిఎ, సీఫ్ మాల్ ముహారాక్, ఇసా టౌన్ ఐడీ సెంటర్స్ శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







