యుఎస్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత..

- January 06, 2020 , by Maagulf
యుఎస్,ఇరాన్ మధ్య ఉద్రిక్తత..

అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు భారత మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం చూపాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మొదట సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో 500 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన బీఎస్ఈ సెన్సెక్స్ .. ఆ తరువాత 40, 764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12, 016 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 702 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు పతనమయ్యాయి. ఇరాన్ తో కయ్యానికి రెడీ అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అదే పనిలో పనిగా ఇరాక్ మీద కూడా ఆంక్షలు విధిస్తానని ప్రకటించారు. ఈ హెచ్చరిక ఎఫెక్ట్ వీటిపై పడింది. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ జనరల్ సోలిమని ఇరాక్ లో మృతి చెందడంతో అంతర్జాతీయంగా గోల్డ్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. బంగారం ధర ఏడు నెలల గరిష్టానికి, క్రూడ్ ధర ఆరు నెలల గరిష్టానికి ఎగబాకాయి. అటు-దేశీయంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సెన్సెక్స్ సూచీలను కుదిపేయడం విశేషం. డాలర్ తో రూపాయి మారకం విలువ 31 పాయింట్లు తగ్గి.. 72. 10 గా కొనసాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com