అమెరికా వెబ్ సైట్ హ్యాక్

- January 06, 2020 , by Maagulf
అమెరికా వెబ్ సైట్ హ్యాక్

యూఎస్ ప్రభుత్వ అధీనంలోని వెబ్ సైట్ ను ఇరాన్ కు చెందిన హ్యాకర్లు, హ్యాక్ చేశారు. ఆ వెబ్ సైట్ హోమ్ పేజీలో, అధ్యక్షుడు ట్రంప్ ను రక్తం వచ్చేలా కొడుతున్న ఓ మార్ఫింగ్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. యూఎస్ ఫెడరల్ డిపాజిటరీ లైబ్రరీ ఈ వెబ్ సైట్ 'www.fdlp.gov' ను నిర్వహిస్తోంది. దీన్ని శనివారం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ వెబ్ సైట్ లో "దేవుడి ప్రేరణతో, ఇరాన్ సైబర్ సెక్యూరిటీ గ్రూప్ హ్యాకర్స్. ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేశాం" అని కామెంట్ పెట్టారు. తాము అనునిత్యమూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ వెబ్ సైట్ ప్రభుత్వ ప్రచురణలను ఉచితంగా ప్రజలకు అందిస్తుంది. ఖాసీమ్ సులేమాని హత్యకు వ్యతిరేకంగా ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు హ్యాకర్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com