ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల తేదీ ఖరారు
- January 07, 2020
ఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన ఓటర్ స్లిప్పులను అందజేస్తారు.
13,659 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!