యూఏఈలో 5 ఏళ్ల మల్టి ఎంట్రీ వీసా...6 నెలలు ఉండేందుకు ఛాన్స్
- January 08, 2020
యూఏఈని గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా డెవలప్ చేయటంలో భాగంగా కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన కేబినెట్ పర్యాటకులకు 5 ఏళ్ల వాలిడిటీతో టూరిస్ట్ వీసా ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ 5 ఇయర్స్ మల్టీపుల్ ఎంట్రీ టూరీస్ట్ వీసాతో ఎన్ని సార్లైనా యూఏఈ విజిట్ చేయవచ్చు. అంతేకాదు ఈ ఐదేళ్లలో ట్రిప్ వెళ్లిన ప్రతీ ఎంట్రీలో 6 నెలలు యూఏఈలో స్టే చేసేందుకు అనుమతి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన టూరిస్ట్ వీసాల విషయంలో అనుసరించే నిబంధనలనే మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా మంజూరులోనూ పాటించనున్నారు. దీంతో ఎలిజిబిలిటీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకు వీసాలను 5 ఇయర్ వాలిటిడీ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. యూఏఈలో పర్యాటక రంగాన్ని మరింత డెవలప్ చేయటం, టూరిస్ట్ ఎకానమీ పెంచుకోవటం లక్ష్యంగా కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







